Friday, April 26, 2019

ముగ్గురు రైతుల ఆత్మహత్య

హోం తాజావార్తలు తెలంగాణా తాజావార్తలు
ముగ్గురు రైతుల ఆత్మహత్య
27-04-2019 03:35:55
వెంకటాపురం(నూగూరు)/నాంపల్లి, ఏప్రిల్‌ 26: రాష్ట్రంలో శుక్రవారం అప్పుల బాధతో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో గంపా మంగయ్య(45)కు మూడేళ్లుగా పంటల దిగుబడి రాకపోవడంతో రూ.5లక్షల అప్పులు పేరుకుపోయాయి. అవి తీర్చే మార్గం లేక పురుగుమందు తాగాడు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపహాడ్‌లో అబ్బనబోయిన శ్రీను(40) పెట్టుబడి కోసం రూ.7లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి దిగుబడి రాకపోవడంతో పురుగు మందు తాగాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌లో కలువల రాజు(32) అప్పుల భారంతో పురుగుల మందు తాగాడు


No comments:

Post a Comment