Monday, December 30, 2019

సీఏఏని అమలు చేసి తీరుతాం: కిషన్‌రెడ్డి

సీఏఏని అమలు చేసి తీరుతాం: కిషన్‌రెడ్డి
30-12-2019 17:53:36


హైదరాబాద్: ఎన్ని నిరసనలు చేసినా సీఏఏని అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే ప్రధాని మోదీ సంకల్పిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సమర్థిస్తున్నారని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. సీఏఏపై బీజేపీ కార్యకర్తతో రాహుల్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను నడిపించేది ఎంఐఎం మాత్రమేనని, ఎంఐఎం నేత ఒవైసీ, సీఎం కేసీఆర్‌ పెద్ద కుర్చీల్లో కూర్చుని, మంత్రి మహమూద్ అలీని పనికిరాని కుర్చీలో కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. సీఏఏతో భారతీయులకు సంబంధం లేదని, భారతీయ ముస్లింలకు సీఏఏతో నష్టం జరగదని తెలిపారు. చొరబాటు దారులు వేరు.. శరణార్థులు వేరని కిషన్‌రెడ్డి చెప్పారు.

Sunday, December 29, 2019

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం - KTR

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం
రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చిన నేత కేసీఆర్‌
మూడు రాజధానులపై ఏపీ ప్రజలే తేల్చుకుంటారు
ఏపీలో జగన్‌ పాలనకు శుభారంభం
పాతనగరానికి మెట్రో రైలు విస్తరణ
ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు  మంత్రి కేటీఆర్‌ జవాబులు

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో తెరాస వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ను అడగండి (ఆస్క్‌ కేటీఆర్‌) పేరిట ఆదివారం ఆయన ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు దేశంలోనే ట్విటర్‌ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా, ప్రపంచవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. కేటీఆర్‌ సమాధానాల సారాంశం ఆయన మాటల్లోనే...
* రాజకీయాల్లో నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు కేసీఆరే. నాకు మంత్రి పదవి కన్నా పార్టీ పదవే విలువైంది. చేనేత వస్త్రాలకు నేను పెద్ద అభిమానిని.
* ఏపీలో మూడు రాజధానులపై ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు శుభారంభమైంది.
* ప్రభుత్వ పనితీరుపై 60 లక్షల మంది తెరాస కార్యకర్తల నుంచి మాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తోంది.
* హైదరాబాద్‌లో సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రారంభమైంది. త్వరలోనే మార్పు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నగరానికి నీటి సమస్య తలెత్తదు.
* ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసింది. తెలంగాణపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.
* కొంపల్లి ఐటీపార్కుకోసం భూసేకరణ చేస్తు న్నాం. ఔషధనగరిని 2020లో ప్రారంభిస్తాం.
* చార్మినార్‌, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం. యూరప్‌, అమెరికా వంటి ప్రాంతాల నుంచి నగరానికి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాల కోసం కృషి చేస్తాం.
* హైదరాబాద్‌లో కొత్తగా 50 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్స్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపాం. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుంది.
* గోపనపల్లిలో పెరుగుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలకు ఆర్థిక జిల్లా నుంచి రోడ్లను నిర్మిస్తాం.

కొన్ని ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న:  సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వవచ్చు కదా?
కేటీఆర్‌: మీకు ధన్యవాదాలు. నాకు పూర్తికాలపు ఉద్యోగం (ఫుల్‌ టైం జాబ్‌) ఉన్నది.

ప్రశ్న: ఏపీలో మీ పార్టీని విస్తరించండి. ఇక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది?
కేటీఆర్‌: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది మా సీఎం కేసీఆర్‌ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.

Thursday, November 21, 2019

ఆర్టీసీ ప్రైవేటీకరణ మంచిదే - హైకోర్టు

ఆర్టీసీ ప్రైవేటీకరణ మంచిదే -  హైకోర్టు
20-11-2019 03:43:29

ఇప్పుడు నడుస్తున్న ధోరణి అదే
రైళ్లు, విమానాల్లో ప్రైవేటు వచ్చేసింది
ప్రపంచీకరణ వేగంగా జరుగుతోంది
మనం 1947 నాటి పరిస్థితుల్లో లేం
రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుపట్టలేం
దీంట్లో చట్టాల ఉల్లంఘన జరగలేదు
రూట్ల ప్రైవేటుపై హైకోర్టు వ్యాఖ్యలు
ప్రైవేటీకరణ నడుస్తున్న ట్రెండ్‌. 1947 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 1991లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలతోనే గుత్తాధిపత్యం పోయింది. పెట్టుబడిదారీ చట్టాలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయి. వేగంగా ప్రపంచీకరణ జరుగుతోంది. పోటీతత్వం ఉంటే సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ జరుగుతున్నపుడు స్వాగతించాలి.
హైకోర్టు ధర్మాసనం

హైదరాబాదు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో 5,100 రూట్‌ పర్మిట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ దశలో తప్పుపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేబినెట్‌ నిర్ణయంలో 5,100 రూట్‌ పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని మాత్రమే ఉందని తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణపై మాజీ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నప్పుడే ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం తీసుకోవడం సరి కాదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు. మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్టు) పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీ యాక్టు)లోని పలు సెక్షన్లను ఉటంకించారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాలను ఏ ఉద్దేశంతో చేశారో సరిగ్గా అన్వయించుకోవాలని సూచించింది. ప్రభుత్వం రూట్ల ప్రైవేటీకరణకు చర్యలు ప్రారంభించాలని మాత్రమే నిర్ణయిచిందని తెలిపింది. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది. ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 102లో ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయని పేర్కొంది.

‘‘చట్ట నిబంధనల ప్రకారం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలంటే... చట్ట సవరణకు సంబంధించి ముందు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దీనిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలి. దీనిపై అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ నిర్ణయం వల్ల నష్టపోయే ఆర్టీసీ సంస్థ అభిప్రాయాన్ని తీసుకోవాలి... కేబినెట్‌ నిర్ణయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది’’ అని గుర్తు చేసింది. ఆర్టీసీ చట్టంలోని 71, 72 సెక్షన్లను ఉటంకిస్తూ ఆర్టీసీ ఏర్పాటు చేయడానికి మునుపు ప్రైవేటు ఆపరేటర్ల చేతిలో ఉన్న రూట్లను ఆర్టీసీకి బదలాయించేందుకు ఉద్దేశించినవని తెలిపింది. వాటిలో కొన్ని రూట్లను ప్రైవేటీకరించడానికి, స్టేజ్‌ క్యారేజ్‌ పర్మిట్‌ ఇచ్చేందుకు ఉన్న నిబంధనలు పాటించాల్సి ఉందని తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఆర్టీసీ యాక్టులోని సెక్షన్‌ 71, 71, 102 నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని ధర్మాసనం ప్రస్తావించింది.

ఉల్లంఘనలు ఉంటే అప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చని తెలిపింది. ప్రైవేటీకరణ నడుస్తున్న ట్రెండ్‌ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 1947 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంది. 1991లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలతోనే గుత్తాధిపత్యం పోయిందని తెలిపింది. పెట్టుబడిదారీ చట్టాలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయని గుర్తు చేసింది. వేగంగా ప్రపంచీకరణ జరుగుతోందని, పోటీతత్వం ఉంటే సౌకర్యాలు మెరుగవుతాయని అభిప్రాయపడింది. ఒకప్పడు ఎయిర్‌ ఇండియా ఒక్కటే విమానయానంలో ఉండేదని, రాను రాను పలు ప్రైవేటు ఎయిర్‌ వేస్‌ వచ్చాయని గుర్తు చేసింది. వాటిలో కొన్ని నిలబడగలిగాయని, కింగ్‌ ఫిషర్‌ వంటి సంస్థలు కనుమరుగయ్యాయని ప్రస్తావించింది. దేశంలో రైల్వే ఒక్కటే ప్రభుత్వ రంగంలో ఉన్న రవాణా సంస్థ అని తెలిపింది.

దాంట్లో కూడా ప్రైవేటు రైళ్లు రాబోతున్నాయని గుర్తు చేసింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ జరుగుతున్నపుడు స్వాగతించాలని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కల్పించుకుంటూ, ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు. ఇటువంటి నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండరాదన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఆయన వాదనలకు ధర్మాసనం అడ్డు చెప్పింది. ఆరోపణలు చేయదలచుకుంటే తగిన ఆధారాలు చూపాలంది. పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోల్పేయేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ప్రభాకర్‌ ప్రస్తావించారు. సుప్రీం తీర్పు ప్రతులను ధర్మాసనం పరిశీలనకు ఇచ్చారు. కోర్టు సమయం ముగియడంతో ఈ వ్యాజ్యంలో గతంలో ఇచ్చిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్‌

ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్‌
Nov 21, 2019, 22:24 IST
KCR Review Meeting On TSRTC Strike - Sakshi
ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి

సంస్థకు అంత శక్తి లేదు.. సర్కారూ భరించలేదు

చార్జీలు పెంచితే ప్రజలు బస్సెక్కని పరిస్థితి వస్తుంది

అన్నీ పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపిస్తాం

ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టు తీర్పు వచ్చే చాన్స్‌

ఆ తర్వాతే సర్కారు తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? సంస్థకు ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

అప్పుల కుప్ప..
‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉద్యోగులకు సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌ రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65–70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, రామకృష్ణారావు, సందీప్‌ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రాంచందర్‌రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Thursday, June 20, 2019

కాళేశ్వరం.. ధూం ధాం

కాళేశ్వరం.. ధూం ధాం
13-06-2019 03:12:02

21న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
స్వయంగా బెజవాడ వెళ్లి జగన్‌కు సీఎం ఆహ్వానం
16న ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సమావేశం
తెలంగాణలోని 80 శాతం ప్రాంతాలకు సాగు, తాగు నీటిని, పరిశ్రమలకు కావాల్సిన జలాలను అందించే జీవనాడి.. కేసీఆర్‌ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు.. రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసే ఆధునిక దేవాలయం.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది! తెలంగాణలో.. ‘నీటి’ కలను సాకారం చేసే వరప్రదాయినిని ప్రారంభించే ముహూర్తం నిశ్చయమైంది!! ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే కార్యక్రమానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు!!

హైదరాబాద్‌/భూపాలపల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడానికి ముహూర్తం కుదిరింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్టు.. ముహూర్తబలం బాగుండడంతో ఈ నెల 21న ఆ ప్రాజెక్టును ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద ఈ మహత్తర ఘట్టానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఇప్పటికే ప్యాకేజీ 6, 7, 8 పనులన్నీ పూర్తిచేసి వెట్‌రన్‌, ట్రయల్‌ రన్‌లు విజయవంతంగా నిర్వహించారు. అయితే, కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద వెట్‌రన్‌ నిర్వహిందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ గోదావరిలో సరిపడా నీటిసామర్థ్యం లేకపోవడంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. నైరుతి రుతుపవనాలు 15లోగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడం.. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ప్రాణహిత నది ద్వారా గోదావరిలోకి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండడంతో వెట్‌ రన్‌కు నీటి కొరత తీరే అవకాశం ఉంది. అయితే వెట్‌రన్‌, ట్రయల్‌రన్‌ అవసరం లేదని.. నేరుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

అర కిలోమీటరు ఎత్తుకు..
మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి.. 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్‌ వరకూ తరలించాలని నిర్ణయించారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేయనున్నారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తిచేశారు. రిజర్వాయర్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం 199 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

40 లక్షల ఎకరాలకు నీరు..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. దీంతో కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజమాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్టవుతుంది. అంటే తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు 139 మెగావాట్ల పంపులను వాడుతున్నాయి. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎవరూ పంపులు వాడలేదు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న సీఎంప్రారంభిస్తారనే అధికారిక సమాచారమేదీ లేదని ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యుత్‌ శాఖ చేసిన పనులు
పంపులు: 100
400 కేవీ సబ్‌ స్టేషన్లు: 6
220 కేవీ సబ్‌ స్టేషన్లు: 9
132 కేవీ సబ్‌ స్టేషన్లు: 2
400 కేవీ లైను పొడవు: 521.08 కిలోమీటర్లు
220 కేవీ లైను పొడవు: 461.05 కిలోమీటర్లు
132 కేవీ లైను పొడవు: 43.2 కిలోమీటర్లు
మొత్తం లైను పొడవు: 1025.3 కిలోమీటర్లు

రాత్రిళ్లూ పనులు
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేేసందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

అంచనా పెంపు..
సుమారు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మూడో టీఎంసీ తరలింపు కోసం అదనంగా మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం మూడు టీఎంసీల నీటి లిప్టు కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1.20 లక్షల కోట్ల వరకూ కావచ్చని భాస్తున్నారు.

విజయవాడ వెళ్లి.. జగన్‌ను స్వయంగా ఆహ్వానించనున్న సీఎం
16న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఈ నెల 21న ప్రారంభించాలని నిర్ణయించారు’ అంటూ విడుదల చేసిన ప్రకటనలోనే జగన్‌కు ఆహ్వానం విషయాన్ని కూడా తెలిపింది. ఇలా ఆహ్వానించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం పెరిగి.. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా జలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం నుంచి సీఎం వారం రోజులపాటు వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఆ రోజు ఉదయం హైదరాబాద్‌లో ‘యాదగిరి’ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. 16న ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలనుకున్నా, సాంకేతిక కారణాలతో వెళ్లలేకపోయారు. దీంతో ఈ పర్యటనలో ప్రధానిని కలుసుకోనున్నారు. అనంతరం 17న కేసీఆర్‌ విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య సన్యాస స్వీకార, పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత 18న కేసీఆర్‌ మహారాష్ట్ర వెళ్లి సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు.

విద్యుత్తూ సిద్ధం
రూ.2890 కోట్లతో పనులు చేశాం
ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ట్రాన్స్‌ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్‌ సబ్‌ ేస్టషన్లు (కాళేశ్వరానికే ప్రత్యేకం) నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్‌ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీటిని మళ్లించే బృహత్కార్యంలోవిద్యుత్తు సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. ప్రభాకర్‌రావు చెప్పారు.

గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్తు అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Tuesday, June 4, 2019

Telangana dry ports

Telangana govt finalises land for dry ports to help increase exports
DECCAN CHRONICLE.
Published Oct 16, 2016, 2:07 am ISTUpdated Oct 16, 2016, 2:50 am IST

Zaheerabad, Bhongir, Jadcherla and Damarcharla stand to benefit.
A dry port is an inland terminal connected to a seaport by rail or road. (Representational image)
 A dry port is an inland terminal connected to a seaport by rail or road. (Representational image)
Hyderabad: The TS government has zeroed in on locations for setting up dry ports. These dry ports will help increase exports from the state from the present Rs 1 lakh-crore to Rs 1.50 lakh-crore per year.

The government had failed to submit proposals to the Centre in this regard despite repeated reminders from the Union shipping ministry over the last two years. The government appointed international consultants to identify suitable locations to set up the dry ports. The consultants took up an extensive study and submitted reports to government. 

Based on the reports, the government proposed to the Centre to set up four dry ports around Hyderabad by spending Rs 2,700 crore. Of this, the TS government has asked the Centre to extend financial assistance of Rs 1,000 crore. Sources in infrastructure and investment department said that the four dry ports proposed at Zaheerabad along NH-9, Bhongir along NH-163, Jadcherla along NH-7 and Damarcharla along the Miryalaguda-Wadapally highway.

“We have identified  825 acres in Zaheerabad, 450 in Bhongir, 319 in Jadcherla and 3,000 acres in Damarcharla. We are ready to hand over the land to union shipping ministry as and when required. There is no need to acquire any private land for these ports as there is abundant government land available in these locations,” the sources said. The Centre is expected to entrust the responsibility of setting up one of these dry ports with the Visakhapatnam Port Trust.

After bifurcation of the state, Telangana was left with no sea ports since it has no coastline. This impacted exports and imports. While the government had urged the Centre to set up dry ports to compensate for the dip in revenue from exports during the last two years, it failed to identify suitable locations and submit proposals to the Centre.

With several new manufacturing units coming up in the state under TS-iPASS, especially in NIMZ-Medak and Hyderabad Pharma City, with a major thrust on exports, the dry ports have become all the more important. A dry port is an inland terminal which is directly connected by rail or road to a sea port. It offers customs clearance, temporary storage, handling and inspection for exports and international cargo similar to that of a sea port.

Thursday, May 9, 2019

21న విపక్షాల భేటీ!

21న విపక్షాల భేటీ!

Thu,May 9, 2019 03:26 AM
Andhra CM Rahul Gandhi discusses plans to call Oppn meet on May 21
-ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా తమనే ఆహ్వానించేలా ప్రణాళిక
-ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రపతిని కలువాలని నిర్ణయం
-రాహుల్‌గాంధీని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 8: ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 21న సమావేశం కానున్నాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా చర్చించనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందుగా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. 21నాటి సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు ఈ నెల 21న ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా వారిద్దరూ వీవీప్యాట్ల లెక్కింపు, ఇటీవలి ఎన్నికల్ల పోలింగ్ శాతం, ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న పరిణామాలు.. తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలింగ్ అంనంతరం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.

ప్రతిపక్షాల సమావేశానికి రావాల్సిందిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరేందుకు చద్రబాబు గురువారం పశ్చిమబెంగాల్ వెళ్లనున్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలువాలని భావిస్తున్నది. మెజార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని కోరనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా సమిష్టిగా బీజేపీపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీవీప్యాట్ల లెక్కింపుపై తీర్పును సమీక్షించాలంటూ 21 పార్టీల కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును మార్చేది లేదంటూ మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసిన వెంటనే.. 22 పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

సాధ్యమేనా?
మెజార్టీతో సంబంధం లేకుండా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న ప్రతిపక్షాల ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫలితాల వెల్లడి అనంతరం ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలో రాష్ట్రపతే నిర్ణయిస్తారు. ఆయనకు మాత్రమే విచక్షణ అధికారం ఉన్నది. ఇప్పటివరకు కేంద్రంలో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇటీవలి పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ సంప్రదాయానికి గండికొట్టింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ ఆయా రాష్ర్టాల గవర్నర్లు కాంగ్రెస్‌ను కాకుండా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా ఉండి కర్ణాటకను మాత్రం దక్కించుకోగలిగాయి ఈ మూడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలువాలని నిర్ణయించాయి.

Akhilesh-Yadav
బీజేపీ నాయకులకు నిద్రలేదు!

-ప్రధానికి మంచి రోజులు ముగిశాయి: మాయావతి
-కుర్చీని లాగొద్దని మోదీ ఓటర్లకు మొరపెట్టుకుంటున్నారు: అఖిలేశ్

ఆజంగఢ్ (యూపీ), మే 8: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ధీమాతో అధికార, విపక్షాలు తమ పార్టీ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రెండు విడుతల లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీ నేతలు ఇటీవల ప్రకటించడాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీఎస్పీ - ఎస్పీ - ఆర్‌ఎల్‌డీ కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఆజంగఢ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. చివరి రెండు విడుతల ఎన్నికల్లో మా కూటమి విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. మహాకూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేదు అని పేర్కొన్నారు. కూటమి ఆజంగఢ్ అభ్యర్థి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తున్నట్టుగా తమది కల్తీ కూటమి కాదని, ఆయనే కల్తీ వ్యక్తి అని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణేనికున్న రెండు ముఖాలని, వాటి స్వభావం, గుణం ఒకటేనని దుయ్యబట్టారు. మోదీకి మంచి రోజులు ముగిశాయని, ఓటమి భయం ఆయన ముఖంలోనే కనిపిస్తున్నదని తెలిపారు. ఓటర్లు మహాకూటమికి బాసటగా నిలిచారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాయ్‌వాలాగా వచ్చి, చౌకీదార్‌గా మారిన మోదీ తన కుర్చీని లాగొద్దని ఓటర్లను అడుక్కుంటున్నారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మంత్రి పదవికి తాను మాయావతికి మద్దతునిస్తానని, అలాగే యూపీ సీఎం పదవికి ఆమె తనకు మద్దతుగా ఉంటారని చెప్పారు.

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
Thu,May 9, 2019 08:50 PM
cmkcr visits Dr Abdul Kalam Memorial in rameshwaram

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మెమోరియల్ లో ఏర్పాటు చేసిన ఫొటోగ్యాలరీని సీఎం వీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు పర్యటనలో భాగంగా..ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.






Thursday, May 2, 2019

HC Sets May 8 Deadline for Revaluation of Marks

Telangana HC Sets May 8 Deadline for Revaluation of Marks of Failed Inter Students as 2 More Kill Self
The court said it will hold a special sitting on May 8 to go through the revaluation of the failed students and take a call on whether re-tallying of marks of the rest of the students is also needed.
News18.comUpdated:April 30, 2019, 1:02 PM IST facebookTwittergoogleskype
Telangana HC Sets May 8 Deadline for Revaluation of Marks of Failed Inter Students as 2 More Kill Self Protesters in front of the Telangana intermediate board office following discrepancies in exam results that led to student suicides.

Enter Phone Number & Age To Check Eligibility For Rs.1 Crore Term

Enter Your Name & Age To Check Your Health Insurance Premium
The Telangana High Court has directed the state’s education department to complete the revaluation of marks of over three lakh students who failed in the Intermediate Board exam and submit its report to it by May 8.

The court was hearing a petition filed by NGO Balala Hakkula Sangham on the discrepancies in the results declared on April 18. The NGO demanded that a criminal case should be registered against the secretary, Board of Intermediate, and compensation be given to families of students who have committed suicide.


Two more students who appeared for the exam have committed, taking the total toll since the result announcement to 23. 


The petitioner also alleged that the private firm processing the result was assigned the task without any contract.

The court said it will hold a special sitting on May 8 to go through the revaluation of the failed students and take a call on whether re-tallying of marks of the rest of the students is also needed. 

The blunders in the result declaration that the government has attributed to software errors has sparked widespread protests by students as well as parents in the state. Out of the 8 lakh students who appeared for the exam, 3.28 lakh were declared failed.

The most famous case was that of Gajja Navya, a student from Karimalla Junior College. She was declared ‘fail’ with zero marks in second year Telugu exam, and this despite securing 98 in the same subject in the first year.

Distraught over his result, the latest student to take the extreme step of committing suicide was Sohail, the son of a retired army man, from Hyderabad’s RK Puram area. He shot himself with his father’s licensed gun. He had failed the board exams was worried over his rank in the IIT-JEE entrance result, which was declared on Monday.

Another girl who failed, Kamindla Lavanya from Vattimalla village in Rajanna Siricilla district, consumed pesticide at her home.

The opposition parties have been protesting the discrepancies in the results.

A probe committee formed by the Telangana government has admitted to ‘errors’ in the process. The committee’s report, submitted on Saturday, said there has been an overall lapse.

The report pointed at major technical issues and a few human errors. The report said that that there was a lack of coordination among the board officials and Globarena, the private firm which processed the result


ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఎప్పుడు?

ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఎప్పుడు?
13-04-2019 02:46:37

ఏపీలో విడుదల.. తెలంగాణలో ఇంకా సందిగ్ధం
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
18 తర్వాతే విడుదలయ్యే అవకాశం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఫలితాల వెల్లడి తేదీపై ఇప్పటివరకు ఇంటర్‌ బోర్డు అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించడంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్‌ పరీక్షలు దాదాపుగా ఒకేసారి పూర్తయ్యాయి. రాష్ట్రంలో మార్చి 18న పరీక్షలు పూర్తి కాగా, ఏప్రిల్‌ 5న మూల్యాంకనం కూడా పూర్తయింది. గతంలో మూల్యాంకనం పూర్తైన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేవారు. కానీ ఈ సారి మూల్యాంకనం పూర్తై వారం గడుస్తున్నా ఫలితాల వెల్లడి తేదీ ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, సాఫ్ట్‌వేర్‌ సమస్యలే ఫలితాల జాప్యానికి ప్రధాన కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సాంకేతిక సమస్యల వల్ల ఫలితాల్లో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా సరే ఫలితాలను సరిగ్గా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 18వ తేదీ తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డులోని ఓ కీలక అధికారి తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు అధికారులు ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Wednesday, May 1, 2019

ఓ బఫూన్ రమ్మంటే వెళ్లాలా?: కేటీఆర్

ఓ బఫూన్ రమ్మంటే వెళ్లాలా?: కేటీఆర్
01-05-2019 15:40:11

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే.. ఇంటర్మీడియట్‌ సమస్యను రావణకాష్టంలా రగలిస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇంటర్ బోర్డ్ టెండర్లు ఇచ్చిందని, దాంతో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్లోబరీనాకు టెండర్ దక్కిత తప్పు తనకు అంటగడుతున్నారని అన్నారు. రూ. 4 కోట్ల టెండర్‌ను రూ.10వేల కోట్ల స్కామ్‌గా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఓ బఫూన్ వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? అని ఫైర్ అయ్యారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయితీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు.




Friday, April 26, 2019

‘గ్లోబరీనా’దే గోల్‌మాల్‌!

గ్లోబరీనా’దే గోల్‌మాల్‌!
Apr 27, 2019, 01:21 IST
 Globarena May Done Mistakes In Intermediate Results - Sakshi
కాంట్రాక్టు చేపట్టిన నాటి నుంచే సాంకేతిక పొరపాట్లు

అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు

తేల్చిన త్రిసభ్య కమిటీ!.. నేడు ప్రభుత్వానికి నివేదిక

కేటగిరీలవారీగా బాధ్యుల వివరాల సేకరణ

గ్లోబరీనాకు కాంట్రాక్టు ఖరారులోనే బోర్డుది వ్యూహాత్మక తప్పిదం

నిబంధనలకు పాతరేసి ఏకపక్షంగా కేటాయించినట్లు కమిటీ నిర్ధారణ? 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో భారీగా చోటు చేసుకున్న పొరపాట్లకు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌దే తప్పని స్పష్టమవుతోంది. ఫలితాలపై నెలకొన్న పరిస్థితి ని క్షుణ్నంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వ్యవ హారంలో జరిగిన పొరపాట్లను గుర్తించి నివేది కలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్టు సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. పరీక్ష ఫీజుల చెల్లింపు వెబ్‌సైట్‌ సరిగ్గా పని చేయకపోవడం మొదలు డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్‌ షీట్లు, ఫలి తాల ప్రాసెసింగ్‌ వరకు గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలాగే గ్లోబరీ నాకు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని, నిబంధనలను పట్టించు కోకుండా బోర్డు ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టినట్లు కమిటీ గుర్తించింది. కాంట్రాక్టు ప్రారంభమైన నాటి నుంచి గ్లోబరీనా పలు సాంకే తిక పొరపాట్లు చేసినా బోర్డు కనీసం పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే విధంగా కాంట్రాక్టు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీసినట్లు సమాచారం.

సమాచారమంతా నివేదికలోకి...
ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. పరీక్షల నిర్వ హణ, ఫలితాల వెల్లడిలో జరి గిన ప్రక్రియనంతా వడపోసిన కమిటీ... ఇందులో బాధ్యులుగా ఉన్న వారిని కేటగిరీలవారీగా విభజించి వివరాలను సేకరిం చింది. ఇంటర్‌ బోర్డు అధి కారులు, ఉద్యోగులతోపాటు గ్లోబరీనా ప్రతినిధులు, గతంలో పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారితోనూ మాట్లాడింది. అలాగే కాంట్రాక్టు సంస్థ, ఇంటర్‌ బోర్డు అధికారులపై వస్తున్న విమర్శలపైనా సమాచారాన్ని సేకరించి నట్లు తెలిసింది. ఈ వివరాలతోపాటు అధికారు లపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని విశ్లేషించింది. కమిటీ ఇచ్చే నివేదికతో పాటు బయటివర్గాల నుంచి విశ్వసనీయంగా సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.

ష్‌... గప్‌చుప్‌...
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గందర గోళంలో పడేసిన ఇంటర్‌ ఫలితాల విషయంలో తప్పొప్పుల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రస్తుతం తమ విచారణ వివరాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. కనీసం మీడియాతో సైతం మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు సైతం పరిశీలన తాలూకు అంశాలను బయటకు వెల్లడి కానివ్వడం లేదు. ఇంటర్‌ ఫలితాల తప్పిదాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటం... లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో కమిటీ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నివేదికలోని అంశాలు బయటపడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కమిటీ బృందం అత్యంత గోప్యత పాటించాలని నిర్ణయించిన క్రమంలో ఎప్పుడు ప్రభుత్వ దరికి నివేదిక చేరుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


త్రిసభ్య కమిటీపై తీవ్ర ఒత్తిడి?
ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించంతో గురువారమే వివరాల సేకరణ పూర్తి చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. సాంకేతిక కారణాలతో నివేదిక సమర్పణలో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో నివేదిక సమర్పణ కోసం కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గ్లోబరీనా సంస్థపై ఆరోపణలకు తోడు... ఆ సంస్థ తప్పిదాలు, ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో కొనసాగించిన వ్యవహారాలపై కమిటీ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిటీపై గ్లోబరీనా సంస్థ కూడా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల విషయంలో సంస్థ పొరపాట్లు లేవనే అంశాన్ని బలంగా వినిపించేందుకు కాంట్రాక్టు సంస్థ రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలో సంస్థ పరపతికి భంగం కలగకుండా చూడాలని కమిటీని కోరేందుకు గ్లోబరీనా యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు నివేదికను అత్యంత గోప్యంగా ప్రభుత్వానికి చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం.

ముగ్గురు రైతుల ఆత్మహత్య

హోం తాజావార్తలు తెలంగాణా తాజావార్తలు
ముగ్గురు రైతుల ఆత్మహత్య
27-04-2019 03:35:55
వెంకటాపురం(నూగూరు)/నాంపల్లి, ఏప్రిల్‌ 26: రాష్ట్రంలో శుక్రవారం అప్పుల బాధతో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో గంపా మంగయ్య(45)కు మూడేళ్లుగా పంటల దిగుబడి రాకపోవడంతో రూ.5లక్షల అప్పులు పేరుకుపోయాయి. అవి తీర్చే మార్గం లేక పురుగుమందు తాగాడు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపహాడ్‌లో అబ్బనబోయిన శ్రీను(40) పెట్టుబడి కోసం రూ.7లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి దిగుబడి రాకపోవడంతో పురుగు మందు తాగాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌లో కలువల రాజు(32) అప్పుల భారంతో పురుగుల మందు తాగాడు