Thursday, May 9, 2019

21న విపక్షాల భేటీ!

21న విపక్షాల భేటీ!

Thu,May 9, 2019 03:26 AM
Andhra CM Rahul Gandhi discusses plans to call Oppn meet on May 21
-ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా తమనే ఆహ్వానించేలా ప్రణాళిక
-ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రపతిని కలువాలని నిర్ణయం
-రాహుల్‌గాంధీని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 8: ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 21న సమావేశం కానున్నాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా చర్చించనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందుగా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. 21నాటి సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు ఈ నెల 21న ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా వారిద్దరూ వీవీప్యాట్ల లెక్కింపు, ఇటీవలి ఎన్నికల్ల పోలింగ్ శాతం, ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న పరిణామాలు.. తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలింగ్ అంనంతరం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.

ప్రతిపక్షాల సమావేశానికి రావాల్సిందిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరేందుకు చద్రబాబు గురువారం పశ్చిమబెంగాల్ వెళ్లనున్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలువాలని భావిస్తున్నది. మెజార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని కోరనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా సమిష్టిగా బీజేపీపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీవీప్యాట్ల లెక్కింపుపై తీర్పును సమీక్షించాలంటూ 21 పార్టీల కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును మార్చేది లేదంటూ మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసిన వెంటనే.. 22 పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

సాధ్యమేనా?
మెజార్టీతో సంబంధం లేకుండా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న ప్రతిపక్షాల ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫలితాల వెల్లడి అనంతరం ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలో రాష్ట్రపతే నిర్ణయిస్తారు. ఆయనకు మాత్రమే విచక్షణ అధికారం ఉన్నది. ఇప్పటివరకు కేంద్రంలో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇటీవలి పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ సంప్రదాయానికి గండికొట్టింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ ఆయా రాష్ర్టాల గవర్నర్లు కాంగ్రెస్‌ను కాకుండా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా ఉండి కర్ణాటకను మాత్రం దక్కించుకోగలిగాయి ఈ మూడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలువాలని నిర్ణయించాయి.

Akhilesh-Yadav
బీజేపీ నాయకులకు నిద్రలేదు!

-ప్రధానికి మంచి రోజులు ముగిశాయి: మాయావతి
-కుర్చీని లాగొద్దని మోదీ ఓటర్లకు మొరపెట్టుకుంటున్నారు: అఖిలేశ్

ఆజంగఢ్ (యూపీ), మే 8: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ధీమాతో అధికార, విపక్షాలు తమ పార్టీ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రెండు విడుతల లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీ నేతలు ఇటీవల ప్రకటించడాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీఎస్పీ - ఎస్పీ - ఆర్‌ఎల్‌డీ కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఆజంగఢ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. చివరి రెండు విడుతల ఎన్నికల్లో మా కూటమి విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. మహాకూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేదు అని పేర్కొన్నారు. కూటమి ఆజంగఢ్ అభ్యర్థి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తున్నట్టుగా తమది కల్తీ కూటమి కాదని, ఆయనే కల్తీ వ్యక్తి అని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణేనికున్న రెండు ముఖాలని, వాటి స్వభావం, గుణం ఒకటేనని దుయ్యబట్టారు. మోదీకి మంచి రోజులు ముగిశాయని, ఓటమి భయం ఆయన ముఖంలోనే కనిపిస్తున్నదని తెలిపారు. ఓటర్లు మహాకూటమికి బాసటగా నిలిచారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాయ్‌వాలాగా వచ్చి, చౌకీదార్‌గా మారిన మోదీ తన కుర్చీని లాగొద్దని ఓటర్లను అడుక్కుంటున్నారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మంత్రి పదవికి తాను మాయావతికి మద్దతునిస్తానని, అలాగే యూపీ సీఎం పదవికి ఆమె తనకు మద్దతుగా ఉంటారని చెప్పారు.

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
Thu,May 9, 2019 08:50 PM
cmkcr visits Dr Abdul Kalam Memorial in rameshwaram

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మెమోరియల్ లో ఏర్పాటు చేసిన ఫొటోగ్యాలరీని సీఎం వీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు పర్యటనలో భాగంగా..ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.






Thursday, May 2, 2019

HC Sets May 8 Deadline for Revaluation of Marks

Telangana HC Sets May 8 Deadline for Revaluation of Marks of Failed Inter Students as 2 More Kill Self
The court said it will hold a special sitting on May 8 to go through the revaluation of the failed students and take a call on whether re-tallying of marks of the rest of the students is also needed.
News18.comUpdated:April 30, 2019, 1:02 PM IST facebookTwittergoogleskype
Telangana HC Sets May 8 Deadline for Revaluation of Marks of Failed Inter Students as 2 More Kill Self Protesters in front of the Telangana intermediate board office following discrepancies in exam results that led to student suicides.

Enter Phone Number & Age To Check Eligibility For Rs.1 Crore Term

Enter Your Name & Age To Check Your Health Insurance Premium
The Telangana High Court has directed the state’s education department to complete the revaluation of marks of over three lakh students who failed in the Intermediate Board exam and submit its report to it by May 8.

The court was hearing a petition filed by NGO Balala Hakkula Sangham on the discrepancies in the results declared on April 18. The NGO demanded that a criminal case should be registered against the secretary, Board of Intermediate, and compensation be given to families of students who have committed suicide.


Two more students who appeared for the exam have committed, taking the total toll since the result announcement to 23. 


The petitioner also alleged that the private firm processing the result was assigned the task without any contract.

The court said it will hold a special sitting on May 8 to go through the revaluation of the failed students and take a call on whether re-tallying of marks of the rest of the students is also needed. 

The blunders in the result declaration that the government has attributed to software errors has sparked widespread protests by students as well as parents in the state. Out of the 8 lakh students who appeared for the exam, 3.28 lakh were declared failed.

The most famous case was that of Gajja Navya, a student from Karimalla Junior College. She was declared ‘fail’ with zero marks in second year Telugu exam, and this despite securing 98 in the same subject in the first year.

Distraught over his result, the latest student to take the extreme step of committing suicide was Sohail, the son of a retired army man, from Hyderabad’s RK Puram area. He shot himself with his father’s licensed gun. He had failed the board exams was worried over his rank in the IIT-JEE entrance result, which was declared on Monday.

Another girl who failed, Kamindla Lavanya from Vattimalla village in Rajanna Siricilla district, consumed pesticide at her home.

The opposition parties have been protesting the discrepancies in the results.

A probe committee formed by the Telangana government has admitted to ‘errors’ in the process. The committee’s report, submitted on Saturday, said there has been an overall lapse.

The report pointed at major technical issues and a few human errors. The report said that that there was a lack of coordination among the board officials and Globarena, the private firm which processed the result


ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఎప్పుడు?

ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఎప్పుడు?
13-04-2019 02:46:37

ఏపీలో విడుదల.. తెలంగాణలో ఇంకా సందిగ్ధం
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
18 తర్వాతే విడుదలయ్యే అవకాశం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఫలితాల వెల్లడి తేదీపై ఇప్పటివరకు ఇంటర్‌ బోర్డు అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించడంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్‌ పరీక్షలు దాదాపుగా ఒకేసారి పూర్తయ్యాయి. రాష్ట్రంలో మార్చి 18న పరీక్షలు పూర్తి కాగా, ఏప్రిల్‌ 5న మూల్యాంకనం కూడా పూర్తయింది. గతంలో మూల్యాంకనం పూర్తైన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేవారు. కానీ ఈ సారి మూల్యాంకనం పూర్తై వారం గడుస్తున్నా ఫలితాల వెల్లడి తేదీ ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, సాఫ్ట్‌వేర్‌ సమస్యలే ఫలితాల జాప్యానికి ప్రధాన కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సాంకేతిక సమస్యల వల్ల ఫలితాల్లో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా సరే ఫలితాలను సరిగ్గా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 18వ తేదీ తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డులోని ఓ కీలక అధికారి తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు అధికారులు ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Wednesday, May 1, 2019

ఓ బఫూన్ రమ్మంటే వెళ్లాలా?: కేటీఆర్

ఓ బఫూన్ రమ్మంటే వెళ్లాలా?: కేటీఆర్
01-05-2019 15:40:11

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే.. ఇంటర్మీడియట్‌ సమస్యను రావణకాష్టంలా రగలిస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇంటర్ బోర్డ్ టెండర్లు ఇచ్చిందని, దాంతో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్లోబరీనాకు టెండర్ దక్కిత తప్పు తనకు అంటగడుతున్నారని అన్నారు. రూ. 4 కోట్ల టెండర్‌ను రూ.10వేల కోట్ల స్కామ్‌గా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఓ బఫూన్ వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? అని ఫైర్ అయ్యారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయితీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు.