Tuesday, February 15, 2022

రేవంత్‌రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ ఇద్దరూ కలిశారు..!

 ఆ ఇద్దరూ కలిశారు..! అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

కోమటిరెడ్డి ఇంటికెళ్లిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

సమస్యలపై ఐక్యంగా పోరాడతాం: కోమటిరెడ్డి

పీకే ప్లాన్‌ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌: రేవంత్‌



PauseUnmute

Fullscreen

VDO.AI

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ కాంగ్రెస్‌ నేతలే.. ఒకరు పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీ. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మరొకరేమో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవినీ పొందిన రేవంత్‌రెడ్డి. ఇద్దరూ కాంగ్రె్‌సలో కీలక నేతలే. కానీ, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముఖంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరినీ వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిశారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో ఆయన్ను కలిసే ప్రయత్నం చేయలేదు.  కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరగ్గా.. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి తిరిగి దగ్గరయ్యారు. తాజాగా భువనగిరి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌తో ఆయన సన్నిహితంగా మెలగడంపై పార్టీలో విమర్శలు వచ్చాయి. దీంతో తాను పార్టీని వీడేది లేదంటూ వెంకట్‌రెడ్డి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.

ఎడమొహం, పెడమొహంగా ఉన్న వీరిద్దరూ హఠాత్తుగా భేటీ కావడం పార్టీలో ఆసక్తిని రేకెత్తించింది. కోమటిరెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి? తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రేవంత్‌, కోమటిరెడ్డిలు తమ మధ్య విభేదాల్లేవంటూ ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డికాంగ్రెస్‌ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగానే పోరాడుతుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపైనా చర్చించినట్లు చెప్పారు. నిరుద్యోగులు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. భువనగిరి సభలో తాను మాట్లాడతానంటే కేసీఆర్‌ మైక్‌ ఇవ్వలేదన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని కొనియాడారు. ‘ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ లాంటి త్యాగం వెంకన్నది’ అని చెప్పారు. కోమటిరెడ్డ్డితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రేవంత్‌.. ‘హ్యాపీ టైమ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌.. మోదీ కోవర్టు: రేవంత్‌కేసీఆర్‌ ప్రధాని మోదీ కోవర్టని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫ్రంట్‌ పేరుతో టెంట్‌ వేసి.. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీని బలహీనపరచాలంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలను బలహీన పరచాలన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలతోనే ఎందుకు చర్చలు జరుపుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రె్‌సపై సానుభూతి ఉన్నట్లు నటిస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌ను నమ్మొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ అనేక సార్లు మోసం చేశారని, కేసీఆర్‌ కుటుంబం కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వచ్చినా దగ్గరికి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌ను కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంతపై రాష్ట్ర వ్యాప్తంగా తాము పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. ఏ ఒక్క చోటా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపించారు. 

మోదీ తీరుపై మీ నాయకుడు మౌనంగా ఎందుకున్నారు?ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్‌ ప్రశ్న ‘‘మొసలి కన్నీరు కార్చడంలో మీ నాయకత్వానికి అత్యంత ప్రావీణ్యం ఉంది. కానీ.. తెలంగాణ తల్లిని, అమరవీరుల త్యాగాలను ప్రధాని మోదీ అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు?’’ అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు కూడా నిలదీస్తున్నారన్నారు. కవిత చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ రేవంత్‌రెడ్డి ఈ విమర్శలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. టీఆర్‌ఎ్‌సను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌కు కవిత కౌంటర్‌ ఇచ్చారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని అవమానించేలా బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పు పట్టారని, హుందాతో కూడిన రాజకీయాలను ఆయన కోరుకుంటారని అన్నారు. కవిత చేసిన ఈ ట్వీట్‌నే రీట్వీట్‌ చేస్తూ మంగళవారం రేవంత్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు.

No comments:

Post a Comment