ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు?
13-04-2019 02:46:37
ఏపీలో విడుదల.. తెలంగాణలో ఇంకా సందిగ్ధం
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
18 తర్వాతే విడుదలయ్యే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఫలితాల వెల్లడి తేదీపై ఇప్పటివరకు ఇంటర్ బోర్డు అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు దాదాపుగా ఒకేసారి పూర్తయ్యాయి. రాష్ట్రంలో మార్చి 18న పరీక్షలు పూర్తి కాగా, ఏప్రిల్ 5న మూల్యాంకనం కూడా పూర్తయింది. గతంలో మూల్యాంకనం పూర్తైన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేవారు. కానీ ఈ సారి మూల్యాంకనం పూర్తై వారం గడుస్తున్నా ఫలితాల వెల్లడి తేదీ ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, సాఫ్ట్‌వేర్ సమస్యలే ఫలితాల జాప్యానికి ప్రధాన కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ సాంకేతిక సమస్యల వల్ల ఫలితాల్లో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా సరే ఫలితాలను సరిగ్గా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 18వ తేదీ తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డులోని ఓ కీలక అధికారి తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే రెండు రోజుల ముందే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:
Post a Comment