ఓ బఫూన్ రమ్మంటే వెళ్లాలా?: కేటీఆర్
01-05-2019 15:40:11
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే.. ఇంటర్మీడియట్ సమస్యను రావణకాష్టంలా రగలిస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఇంటర్ బోర్డ్ టెండర్లు ఇచ్చిందని, దాంతో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్లోబరీనాకు టెండర్ దక్కిత తప్పు తనకు అంటగడుతున్నారని అన్నారు. రూ. 4 కోట్ల టెండర్‌ను రూ.10వేల కోట్ల స్కామ్‌గా చెబుతున్నారని దుయ్యబట్టారు. ఓ బఫూన్ వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? అని ఫైర్ అయ్యారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయితీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు.

No comments:
Post a Comment