Tuesday, February 15, 2022

రేవంత్‌రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ ఇద్దరూ కలిశారు..!

 ఆ ఇద్దరూ కలిశారు..! అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

కోమటిరెడ్డి ఇంటికెళ్లిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

సమస్యలపై ఐక్యంగా పోరాడతాం: కోమటిరెడ్డి

పీకే ప్లాన్‌ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌: రేవంత్‌



PauseUnmute

Fullscreen

VDO.AI

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ కాంగ్రెస్‌ నేతలే.. ఒకరు పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీ. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మరొకరేమో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవినీ పొందిన రేవంత్‌రెడ్డి. ఇద్దరూ కాంగ్రె్‌సలో కీలక నేతలే. కానీ, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముఖంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరినీ వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిశారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో ఆయన్ను కలిసే ప్రయత్నం చేయలేదు.  కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరగ్గా.. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి తిరిగి దగ్గరయ్యారు. తాజాగా భువనగిరి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌తో ఆయన సన్నిహితంగా మెలగడంపై పార్టీలో విమర్శలు వచ్చాయి. దీంతో తాను పార్టీని వీడేది లేదంటూ వెంకట్‌రెడ్డి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.

ఎడమొహం, పెడమొహంగా ఉన్న వీరిద్దరూ హఠాత్తుగా భేటీ కావడం పార్టీలో ఆసక్తిని రేకెత్తించింది. కోమటిరెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి? తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రేవంత్‌, కోమటిరెడ్డిలు తమ మధ్య విభేదాల్లేవంటూ ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డికాంగ్రెస్‌ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగానే పోరాడుతుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపైనా చర్చించినట్లు చెప్పారు. నిరుద్యోగులు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. భువనగిరి సభలో తాను మాట్లాడతానంటే కేసీఆర్‌ మైక్‌ ఇవ్వలేదన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని కొనియాడారు. ‘ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ లాంటి త్యాగం వెంకన్నది’ అని చెప్పారు. కోమటిరెడ్డ్డితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రేవంత్‌.. ‘హ్యాపీ టైమ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌.. మోదీ కోవర్టు: రేవంత్‌కేసీఆర్‌ ప్రధాని మోదీ కోవర్టని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫ్రంట్‌ పేరుతో టెంట్‌ వేసి.. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీని బలహీనపరచాలంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలను బలహీన పరచాలన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలతోనే ఎందుకు చర్చలు జరుపుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రె్‌సపై సానుభూతి ఉన్నట్లు నటిస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌ను నమ్మొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ అనేక సార్లు మోసం చేశారని, కేసీఆర్‌ కుటుంబం కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వచ్చినా దగ్గరికి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌ను కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంతపై రాష్ట్ర వ్యాప్తంగా తాము పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. ఏ ఒక్క చోటా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపించారు. 

మోదీ తీరుపై మీ నాయకుడు మౌనంగా ఎందుకున్నారు?ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్‌ ప్రశ్న ‘‘మొసలి కన్నీరు కార్చడంలో మీ నాయకత్వానికి అత్యంత ప్రావీణ్యం ఉంది. కానీ.. తెలంగాణ తల్లిని, అమరవీరుల త్యాగాలను ప్రధాని మోదీ అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు?’’ అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు కూడా నిలదీస్తున్నారన్నారు. కవిత చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ రేవంత్‌రెడ్డి ఈ విమర్శలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. టీఆర్‌ఎ్‌సను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌కు కవిత కౌంటర్‌ ఇచ్చారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని అవమానించేలా బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పు పట్టారని, హుందాతో కూడిన రాజకీయాలను ఆయన కోరుకుంటారని అన్నారు. కవిత చేసిన ఈ ట్వీట్‌నే రీట్వీట్‌ చేస్తూ మంగళవారం రేవంత్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు.

Monday, February 14, 2022

తెలంగాణకేసీఆర్‌ దూకుడు మర్మమేంటో!

 తెలంగాణకేసీఆర్‌ దూకుడు మర్మమేంటో!

Feb 15 2022 @ 01:50AMహోం


కర్ణాటకతో పాటే వచ్చే ఏడాది మే లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన

అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే ఇక్కడ ఆ పార్టీకి అనుకూల పరిస్థితులుంటాయని అంచనా

 టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ముక్కోణపోటీ

మళ్లీ అధికారమే కేసీఆర్‌ వ్యాఖ్యల లక్ష్యం!

టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

కర్ణాటకతో పాటే వచ్చే ఏడాది మే లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన.. 

 మళ్లీ అధికారమే కేసీఆర్‌ వ్యాఖ్యల లక్ష్యం

 టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వరుస మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దూకుడు పెంచినా.. కాంగ్రె్‌సతో సంబంధం లేదంటూనే ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి అనూహ్యంగా మద్దతు పలికినా.. ఆయన రాజకీయ వ్యూహంలో భాగమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యాఖ్యలన్నీ ఆయన దూరదృష్టితో చేస్తున్నవేనని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టడం.. అంటే, వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా సీఎం కార్యాచరణను చూడాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు కొందరు విశ్లేషిస్తున్నారు.

మళ్లీ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేయడం, టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య ముక్కోణ పోటీ కోరుకోవడం తమ అధినేత ప్రస్తుత ఎత్తుగడల వెనుక వ్యూహం కావచ్చని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడకుండా చూడటం కేసీఆర్‌ లక్ష్యాల్లో ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి.

కర్ణాటక అసెంబ్లీతోపాటు.. కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం 2023 మే 24న ముగుస్తుంది. ఆ ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు చాలామంది టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కంటే, విపక్ష కాంగ్రె్‌సకు అనుకూల పరిస్థితులున్నాయని వారు అంచనా వేస్తున్నారు. అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి పెరిగి, ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే.. ఆ ప్రభావం పొరుగు రాష్ట్రమైన మనపైనా (తెలంగాణపై) పడుతుందని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అన్ని రకాలుగా బలం చేకూరుతుందని, ఇది తమకు నష్టం చేస్తుందని వారు అంటున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలంటే, కర్ణాటక అసెంబ్లీతోపాటు, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని టీఆర్‌ఎస్‌ వర్గాలు కోరుకుంటున్నాయి.

వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం 2024, జనవరి 16న ముగుస్తుంది. అంతకంటే ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ నేపథ్యంలో.. ‘‘కర్ణాటక అసెంబ్లీతోపాటు ఇక్కడా ఎన్నికలు రావాలంటే ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో ఇక్కడ అసెంబ్లీని రద్దు చేయాలి. ఏడాది పదవీకాలాన్ని వదులుకోవాలి. అప్పుడే ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీని నివారించగలుగుతాం’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.

అయితే.. ‘‘మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే, అందుకు కారణాలను ప్రజలకు చెప్పడంలో సఫలీకృతులం కావాలి. ఇందులో విఫలమైతే మాత్రం, మొదటికే మోసం రావచ్చు’ అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది. పైగా కేంద్రంలోని బీజేపీ సర్కారుతో రాజకీయ యుద్ధానికి దిగడం, స్వయంగా ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే, వారి నుంచి ఇదివరకటి సహకారం ఉంటుందని ఊహించలేమని.. అసెంబ్లీని రద్దు చేశాక కేంద్రం ఉద్దేశపూర్వకంగా గవర్నర్‌ పాలన తెస్తే, కొత్త తలనొప్పులు తప్పవని వారు అంటున్నారు.

బీజేపీ బలం పెరిగితేనే..తాము ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా, వెళ్లకపోయినా.. రాష్ట్రంలో బీజేపీ బలపడితేనే తమకు రాజకీయంగా లాభమని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య ముక్కోణ పోటీ జరిగి అంతిమంగా తమకు ప్రయోజనం కలుగుతుందని, మళ్లీ అధికారంలోకి రాగలుగుతామని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత సహజమని.. ఆ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి, అదీ కాంగ్రె్‌సకు పడకుండా, బీజేపీ కూడా వ్యతిరేక ఓట్లను భారీగా పొందాలనేది తమ వ్యూహమని వివరిస్తున్నాయి.

‘‘తెలంగాణలో బతికిచెడ్డ కాంగ్రె్‌సకు ఇంకా ఓటు బ్యాంక్‌ ఉంది. అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకతతో పుంజుకోవద్దు. కాంగ్రెస్‌ మా సమీపంలోకి రాకుండా ఉండాలంటే, బీజేపీ బలంగా మారాలి’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. ఈ కోణంలోనే రాష్ట్రంలో బీజేపీతోనే తమకు పోటీ అన్నట్లుగా తమ అధినేత విమర్శలు ఉంటున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ‘‘బీజేపీ ఓటు బ్యాంక్‌ రాష్ట్ర స్థాయిలో సింగిల్‌ డిజిట్‌ దాటదు. ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా లేరు. అటువంటి బీజేపీని టార్గెట్‌గా చేసుకోవడం వల్ల దానికి పెరిగే ఓట్లు, కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయి. బీజేపీ బలంగా మారకపోతే, ఆ ఓట్లు కాంగ్రె్‌సకి వెళ్తాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు’’ అనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

రాహుల్‌కు అండగా అందుకే..కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి బీజేపీ సీఎం హిమంత విశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పుపట్టడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. రాహుల్‌గాంధీ, ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలవడం ఆలస్యం.. ‘వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయి’ అనే వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. ఇది నిజమా? కాదా? అనేది ఇప్పటికిప్పుడు తేలదుగానీ.. ఈ ప్రచారం కాంగ్రె్‌సకు రాజకీయంగా నష్టం చేస్తుందని, తమకు లాభం చేస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ కాంగ్రె్‌సకు అనుకూలంగా మాట్లాడటం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసినా, టీఆర్‌ఎ్‌సకి ఓటు వేసినా ఒకటేననే అభిప్రాయం కలుగుతుందని, అప్పుడు కాంగ్రె్‌సకి పడే ఓట్లు తమకే పడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. అయితే.. ప్రస్తుతానికి రాజకీయంగా అంతగా బలంగా లేని బీజేపీని ప్రధాన శత్రువుగా చిత్రీకరించి యుద్ధం చేయడం, తమ వనరులు, శక్తిని ఆ పార్టీపై వెచ్చించడం ఎంతవరకు సబబనే ప్రశ్న కూడా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. బీజేపీ సర్కారు రాఫెల్‌, అమెరికా ఎన్నికల వంటి విషయాల్లో తప్పు చేసినప్పటికీ.. అవి జరిగినప్పుడు కాకుండా, ఇప్పుడు వేలెత్తిచూపటంపై  సాధారణ జనం వ్యక్తం చేస్తున్న సందేహాలకు తమ వద్ద జవాబు లేదని టీఆర్‌ఎస్‌ నేతలు కొందరు చెబుతున్నారు.

జాతీయస్థాయిలో కీలకపాత్ర సాధ్యమా?రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటితోనే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించటం సాధ్యమా అనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరిన సంగతి తెలిసిందే. కానీ, అప్పుడు పరిస్థితులు కలిసిరాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన బీజేపీకి ఇతర పార్టీల అవసరం రాలేదు. రాష్ట్రంలో 16 చోట్ల గెలుస్తామని భావించిన టీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు కాలు దువ్వుతుండడంపై పార్టీ వర్గాల్లో సానుకూలత వ్యక్తం కావట్లేదని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు చెబుతున్నారు. ‘‘జాతీయ పార్టీ పెట్టి ఉత్తరాదిలో మద్దతు పొందడం, కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం అంత సులువు కాదు. ఒకవేళ తీసుకు వచ్చినా.. నాయకత్వ బాధ్యతల సమస్య తలెత్తుతుంది. అన్నింటికీ మించి.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని చెప్పలేం. తక్కువ స్థానాల్లో గెలిచి, కేంద్రంలో చక్రం తిప్పటం వీలుకాకపోచ్చు’’ అని విశ్లేషకులు అంటున్నారు. 

యూపీ ఎన్నికల తర్వాతే స్పష్టత..సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయని, పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని చాలా మంది టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ఆయనగా లీకులు ఇవ్వాలని భావిస్తే తప్ప.. ఆయన మదిలో ఏమున్నదో తెలుసుకోవటం అసాధ్యమని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్‌ మాటల వెనుక మర్మంపై స్పష్టత రావచ్చని అంటున్నారు.

Monday, September 7, 2020

వీఆర్వోలు వద్దు

 వీఆర్వోలు వద్దు

గిర్దావర్ల నివేదికలే ప్రామాణికం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం


ఆ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది


వారి వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోంది


రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే..


గ్రామ వ్యవస్థ రద్దు ఒక్కటే మార్గం


వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలి


ఎమ్మార్వోకు కుదించి ఆర్డీవోకు అధికారాలు 


సంఘాలతో చర్చించాకే సంస్కరణలు


ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి


నేడో, రేపో సంఘాల బాధ్యులతో భేటీ


ఇతర శాఖలకు పంపితే ఊరుకోం


వీఆర్‌వోలపై అవినీతి ముద్ర సరికాదు


కొత్త చట్టంలోనూ మా పాత్ర: వీఆర్‌వోలు




హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన అన్నారు. రికార్డుల్లో పేర్లు చేర్చాలంటే డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు దిశగా ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏల)ను మాత్రం రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎం అన్నారు. వీరిలో అర్హత కలిగిన, విద్యావంతులైన వారికి ఇప్పటిదాకా వీఆర్‌వోలు నిర్వహించిన బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక ప్రతి తహసీల్దార్‌ ఆఫీసులో ప్రస్తుతం ఉన్న ఇద్దరు గిర్దావర్‌ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌)ల సంఖ్యను నాలుగుకు పెంచాలన్నారు.




ఇకపై ఆర్‌ఐల నివేదికలే ప్రామాణికంగా సేవలందాలని ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానున్న కొత్త రెవెన్యూచట్టంతోపాటు శాఖలో అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆదివారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు/భూముల యాజమానులకు మరింత వేగంగా సేవలందించడానికిగాను రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) యాక్ట్‌ను సులభతరం చేయాలన్నారు. దాంతోపాటు నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసె్‌సమెంట్‌ (నాలా)ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యవసాయ భూములను విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మార్చకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. వివాదాల్లేని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగ్గానే.. రికార్డుల్లో మ్యుటేషన్‌ వేగంగా జరగాలని నిర్దేశించారు. 




తహసీల్దార్ల అధికారాలు కత్తెర..


రెవెన్యూశాఖలో ప్రధానంగా వీఆర్‌వోతోపాటు తహసీల్దార్‌ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందని, అపరిమిత అధికారాల వల్లే ఇలా తయారయిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే తహసీల్దార్లకు ఉన్న అధికారాలను కుదించాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఆర్డీవోలకు పరిమిత అధికారాలే ఉన్నాయని, డివిజనల్‌ స్థాయిలో కలెక్టర్‌కు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసే వ్యవస్థ లాగా ఇది మారిందని, దీనిని సంస్కరించాలని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచినందున వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.




కొత్తగా తేనున్న చట్టాల్లో తహసీల్దార్ల పాత్రను పరిమితం చేసేలా, ఆర్డీవోల అధికారాలను బలోపేతం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే రెవెన్యూ శాఖలో తేనున్న సంస్కరణల అమలుకు ముందు రెవెన్యూ సంఘాలన్నింటితో చర్చించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం కార్యాలయం ఆదివారం వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ల దాకా ఉన్న సంఘాల వివరాలతోపాటు బాధ్యుల సమాచారం తీసుకుంది. సోమవారం లేదా మంగళవారం ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన సంఘం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రతినిధులతో కాసేపు సీఎం చర్చించారు. సంఘాలతో జరిగే సమావేశమే రెవెన్యూశాఖ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.   









నయా భారత్ - జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పార్టీ

 నయా భారత్

జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పార్టీ

Sep 7 2020 @ 04:08AMహోంతెలంగాణ

పేరు ఇప్పటికే ఖరారు.. చురుగ్గా రిజిస్టర్‌ యత్నాలు


మమత, హేమంత్‌ వంటి నేతలతో మంతనాలు


బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకోవడానికే


జమిలి ఎన్నికల తర్వాత అధ్యక్ష పాలనకు కమలం పావులు


అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలే


అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం


అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘జాతీయ’ అరంగేట్రం


పార్టీపై న్యాయ కోవిదులు, నిపుణులతో మంతనాలు


నేటి టీఆర్‌ఎస్‌ఎల్పీలోనూ దీనిపై చర్చ.. తీర్మానం?




దేశం గురించి మాట్లాడడానికి కేసీఆర్‌ వెనకాడడు. తెలంగాణను మంచిగా చేశా. ఇక దేశం సమస్యలు తేలుస్తా. అవసరమైతే నేనే లీడ్‌ తీసుకుంటా. 




భారతీయ జీవిక, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయమే అత్యంత కీలకం. మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడి విధానం పాటించాలి.




జాతీయ నేతలుగా చెప్పుకునే వారిలో ఒకాయనేమో (రాహుల్‌ గాంధీ) ప్రధాని చోర్‌ అంటాడు. ప్రధానమంత్రేమో తల్లీకొడుకులు (సోనియా, రాహుల్‌) బెయిలుపై ఉన్నారని అంటాడు.




ప్రధానమంత్రి సడక్‌యోజన ఎవడిక్కావాలి. వీటిని నిర్మించేందుకు గ్రామ పరిపాలన వ్యవస్థలు లేవా?




దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 40 కోట్ల ఎకరాలు సాగవుతున్నాయని అనుకున్నా.. ఇంకా 30 వేల టీఎంసీల నీరు మిగులు ఉంటుంది. ఈ విషయాలు నేను చెప్పినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు.




- గతంలో వివిధ సందర్భాల్లో  కేసీఆర్‌ వ్యాఖ్యలు




హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కావాలని నినదించిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ప్రజల ఆకాంక్షలను ఆ రెండు పార్టీలూ నెరవేర్చలేకపోయాయని, కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన ఆయన.. ఇప్పుడు ‘నయా భారత్‌’ పేరిట జాతీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేసిన కేసీఆర్‌.. దానిని రిజిస్టర్‌ చేసే ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది.




అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీజేపీ ‘అధ్యక్ష రాజకీయాల’ను అడ్డుకునేందుకు ‘నయా భారత్‌’ పేరిట జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2022 చివర్లో కానీ, 2023లో కానీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా పావులు కూడా కదుపుతోంది. ఇందుకు ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆధ్వర్యంలో ఓ అంతర్గత కమిటీ వేసింది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ చురుగ్గా పరిశీలిస్తోంది. అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.




ఈ ఎజెండానే ధ్యేయంగా బీజేపీ ఇప్పటికే ‘ఒకే దేశం.. ఒకే విధానం’ పేరిట అడుగులు వేస్తోంది. ఈ నినాదంతోనే జమిలి ఎన్నికలకు వెళ్లడానికి పావులు కదుపుతోంది. ఆ ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచి.. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష తరహా పాలనకు తెరతీయాలని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్‌.. ముందుగానే అప్రమత్తమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ‘ఒకే దేశం.. ఒకే విధానం’ నినాదానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడానికి పావులు కదుపుతున్నారని వివరించాయి. అయితే, సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా? లేక కలిసి వచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొంటారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలతో కేసీఆర్‌ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ వంటి నేతలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.




నిజానికి, ‘నయా భారత్‌’ పేరిట ఇప్పటికే హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లకు చెందిన పార్టీలు జాతీయ స్థాయిలో పేరును రిజిస్టర్‌ చేయించినట్లు తెలిసింది. దాంతో, ఆయా పార్టీల నేతలతో కూడా టీఆర్‌ఎస్‌ నేతలు చర్చలు సాగించినట్లు సమాచారం. పార్టీ విధి విధానాలు, ఇతర అంశాలపై మాడభూషి శ్రీధరాచార్యులు వంటి తెలంగాణకు చెందిన న్యాయ కోవిదులు, ప్రముఖులతో కూడా కేసీఆర్‌ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఎజెండా కూడా జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తు అని పార్టీ వర్గాలు వివరించాయి.




లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే..


‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తన జాతీయ ఆకాంక్షలను  సీఎం కేసీఆర్‌ సుస్పష్టంగా వెల్లడించారు. పాకిస్థాన్‌ను నియంత్రించడంలో, జాతీయ భద్రతను కాపాడడంలో, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో విజయవంతంగా అమలు చేసిన విద్యుత్తు, సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. 2,21,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 1,80,000 మెగావాట్లను మాత్రమే దేశం వినియోగించుకుంటోందని, సగం దేశం చీకట్లో మగ్గుతోందని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ, సాగునీటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు.




ఈ విషయాలను ప్రధాని మోదీకి తాను చెప్పినా పట్టించుకోలేదని కూడా ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని అప్పట్లోనే వెల్లడించారు. చెన్నై వెళ్లి స్టాలిన్‌, కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీ వంటి వారితో మంతనాలు కూడా జరిపారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఉప ప్రధాని పదవి కోరాలంటూ యోచనలు సాగాయని అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కేసీఆర్‌ ప్రధాని అయితే తప్పేంటి అంటూ ఆయన తనయ కవిత సహా టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారమూ జరిగింది. అయితే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం రావడంతో కేసీఆర్‌ అడుగులు ముందుకు పడలేదు.




ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జీఎస్టీ పరిహారం ఇచ్చేది లేదని, కావాలంటే రాష్ట్రాలు అప్పులు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంపై మండిపడుతున్నారు. కరోనాను సమర్థంగా నిలువరించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, జాతీయ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించడం జాతీయ స్థాయిలోనూ తమకు అనుకూలంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలను కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.




కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించడం ఒకటైతే.. ముఖ్యమంత్రి హోదాలోనే కేంద్రంలో చక్రం తిప్పడం మరొకటని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లినా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినా పూర్తిస్థాయి గౌరవం లభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇదే జరిగితే, రాష్ట్రంలో కేటీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పటించడమే కాకుండా పాలనకు సంబంధించిన పూర్తి పగ్గాలను అప్పగించవచ్చని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశం సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్‌ జాతీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీపై చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశంలో నేతలు ముక్త కంఠంతో సంఘీభావం తెలిపితే తీర్మానం చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని తెలిపాయి.

Friday, May 22, 2020

కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా

కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా
AddThis Sharing Buttons
Facebook Twitter LinkedIn Messenger Telegram
కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా


రాష్ర్టాల చేతుల్లోకి నగదు రావాలి కానీ కేంద్రం బిచ్చగాళ్లను చేసింది
రుణ పరిమితి పెంచారు.. కానీ దుర్మార్గపు ఆంక్షలు పెట్టారు
రూపాయి మెహర్బానీ కూడా లేదు కేంద్రం తన పరువును తీసుకున్నది
సంస్కరణలు అమలు చేయబోం సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చి దగా అని, నూటికి నూరు శాతం బోగస్‌ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ర్టాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు. అప్పు తెచ్చుకొనేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచినట్టే పెంచి దరిద్రపుగొట్టు ఆంక్షలు విధించిందని ధ్వజమెత్తారు. ప్రజల మెడపై కత్తిపెడితే అప్పు తెచ్చుకొనేందుకు అనుమతినిస్తాననడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణం పొందేందుకు సంస్కరణలు అమలు చేయాలంటూ కేంద్రం విధించిన షరతులను అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు.

సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి డొల్ల. వందకు వంద శాతం బోగస్‌. ఇది నేను చెప్తలేను. సింగపూర్‌ నుంచి వచ్చే ఏషియన్‌ ఇన్‌సైడ్స్‌ అంతర్జాతీయ జర్నల్‌లో ‘హౌ పోటెంట్‌ ఇజ్‌ ది ఎకనామిక్‌ వ్యాక్సిన్‌ ఆఫ్‌ ఇండియా.. వట్టిదే బోగస్‌.. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేదు, అంత గాలి కథ’ అని వ్యాఖ్యానించింది. జపాన్‌ నుంచి వెలువడే ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ జర్నల్‌.. ‘డియర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌, ఇజ్‌ దిస్‌ ది ఎయిమ్‌ టూ రివైవ్‌ జీడీపీ.. ఆర్‌ టు రిలీజ్‌ ది 20 లాక్‌ క్రోర్‌ నంబర్‌.. ఇది అంకెల గారడీనా, లేక జీడీపీని పునరుద్ధరించడమా?’ అని ప్రశ్నించింది. ఇది చాలా దుర్మార్గమైన ప్యాకేజీ. పూర్తి ఫ్యూడల్‌ విధానంలో ఉంది.



నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. మేం అడిగింది.. కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక పరిస్థితిని నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి. అప్పుడు అది ప్రజల చేతుల్లోకి పోతుంది. మేం అది అడిగితే రాష్ట్రాలను భిక్షగాళ్లలాగా భావించి కేంద్రం ఏం చేసింది? ఇదేనా దేశంలో సంస్కరణలు అమలు చేసే పద్ధతి. ఎఫ్‌ఆర్‌బీఎం రెండు శాతం పెంచారు. దీని ద్వారా తెలంగాణకు 20 వేల కోట్ల రూపాయలు వస్తాయి. దీనికి కేంద్రం పెట్టిన షరతులు వింటే నవ్వుతారు. అది కూడా రాష్ట్రం కట్టుకునే అప్పు. వీళ్ల మెహర్బానీ ఒక్క రూపాయి కూడా లేదు. రుణ పరిమితి మాత్రమే పెంచింది. కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదు. ఇందులో కూడా దరిద్రపుగొట్టు ఆంక్షలు ఉన్నాయి. రూ. 5 వేల కోట్లు ఇస్తారట.. దీని గురించి కొన్ని పత్రికలు రాశాయి. కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్‌ కూడా రాశాయి. దీని ద్వారా తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని రాశాయి. తెలంగాణకు ఇప్పటికే 3.5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంది. ఇందులో కొత్తగా వచ్చేది ఏమీలేదు.



ప్రజల మెడపై కత్తి పెట్టాలా?
మిగిలిన వాటిల్లో రూ. 2,500 కోట్లకు ఒకటి చొప్పున సంస్కరణ ఆంక్ష పెట్టారు. కరెంటు సంస్కరణలు తీసుకొస్తే, ప్రజల మెడ మీద కత్తి పెడితే రూ. 2,500 కోట్లు ఇస్తారట, ఇది ప్యాకేజా? వాట్‌ ఇజ్‌ దిస్‌? దీన్ని ప్యాకేజీ అనరు. ఫెడరల్‌ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం ఇది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ఈ విధంగా వ్యవహరించవచ్చునా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత దుర్మార్గం. మార్కెట్‌ కమిటీల్లో కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలుచేస్తే మరో రూ.2,500 కోట్లు ఇస్తారట. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మున్సిపాలిటీల్లో ఆదాయం పెంచితే, పన్నులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. దీన్ని ప్యాకేజీ అంటారా? ప్రోత్సహించే విధానమేనా ఇది? వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌కార్డు.. ఇందులో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చాంపియన్లుగా ఉన్నాం. నాలుగింటిలో మూడు సంతృప్తి పరిస్తే మరో రూ.5వేల కోట్లు ఇస్తారట. ఇదేం బేరమండి?. ఇది పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ. అంతా గ్యాస్‌. కేంద్రం తన పరువును తానే తీసుకుం ది. భవిష్యత్‌లో ఇది విజన్‌ ప్యాకేజా లేక బోగస్‌ ప్యాకేజా అనేది ప్రజలకు తెలుస్తుంది.

కేంద్రం వైఖరి బాధాకరం
ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఐ రియల్లీ ఫీల్‌ పెయిన్‌ఫుల్‌. ఐ రియల్లీ ఫీల్‌ వెరీ సారీ. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్‌ ఫెడరలిజం అని ప్రధాని చెప్పారు. అది పూర్తిగా డొల్ల, బోగస్‌ అనేది ఇప్పుడు రుజువైంది. ఇంకెక్కడి ఫెఢరలిజం? దారుణంగా వ్యవహరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇది చేస్తే పైసలిస్తం, అది చేస్తే పైసలిస్తం అనడం, పిల్లల కొట్లాటనా? ఇది వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడమీద కత్తి పెట్టి కరెంటు సంస్కరణలు అమలు చేస్తే నీకు బిచ్చం ఇస్తాం అనడం ప్యాకే జీనా? ఈ విధానం కరెక్టు కాదు. కరెం టుసంస్కరణలను మేం అమలుచేయం.

ముష్ఠి మాకొద్దు
క్యాబినెట్‌ సమావేశంలో చర్చించాం. సంస్కరణలు అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ముష్ఠి రూ. 2500 కోట్లు తీసుకోం. కేంద్రంపై సమ యం వచ్చినప్పుడు పోరాటం చేస్తాం. శిశుపాలునికి కూడా వంద తప్పులు మన్నించారు కదా. ఏదైనా పండాలి. పండే సమయం వచ్చినప్పుడు ఎట్ల పం డుతదో ఎట్ల ఫైటింగ్‌ అయితదో సూడు’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానాలిచ్చారు. వేస్‌  అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ల పెంపు గురించి మాట్లాడుతూ.. ‘అది మా డబ్బే కదా.. మన ఓన్‌ సోర్స్‌. ఎప్పుడన్నా పైసలు వెళ్లకుండా ఉంటే ఎక్కువ డ్రా చేసుకునే అవకాశం. ఇది కూడా 500-600 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ప్రభుత్వాలు. రాష్ట్రాలు సబార్డినేట్‌లు కావు. కేంద్రం కంటే రాష్ట్రాల పైనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జవాబుదారీ ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం. 

Monday, December 30, 2019

సీఏఏని అమలు చేసి తీరుతాం: కిషన్‌రెడ్డి

సీఏఏని అమలు చేసి తీరుతాం: కిషన్‌రెడ్డి
30-12-2019 17:53:36


హైదరాబాద్: ఎన్ని నిరసనలు చేసినా సీఏఏని అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే ప్రధాని మోదీ సంకల్పిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సమర్థిస్తున్నారని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. సీఏఏపై బీజేపీ కార్యకర్తతో రాహుల్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను నడిపించేది ఎంఐఎం మాత్రమేనని, ఎంఐఎం నేత ఒవైసీ, సీఎం కేసీఆర్‌ పెద్ద కుర్చీల్లో కూర్చుని, మంత్రి మహమూద్ అలీని పనికిరాని కుర్చీలో కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. సీఏఏతో భారతీయులకు సంబంధం లేదని, భారతీయ ముస్లింలకు సీఏఏతో నష్టం జరగదని తెలిపారు. చొరబాటు దారులు వేరు.. శరణార్థులు వేరని కిషన్‌రెడ్డి చెప్పారు.

Sunday, December 29, 2019

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం - KTR

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం
రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చిన నేత కేసీఆర్‌
మూడు రాజధానులపై ఏపీ ప్రజలే తేల్చుకుంటారు
ఏపీలో జగన్‌ పాలనకు శుభారంభం
పాతనగరానికి మెట్రో రైలు విస్తరణ
ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు  మంత్రి కేటీఆర్‌ జవాబులు

పౌరసత్వ చట్టంపై మంత్రిమండలిదే నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో తెరాస వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ను అడగండి (ఆస్క్‌ కేటీఆర్‌) పేరిట ఆదివారం ఆయన ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపు దేశంలోనే ట్విటర్‌ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా, ప్రపంచవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. కేటీఆర్‌ సమాధానాల సారాంశం ఆయన మాటల్లోనే...
* రాజకీయాల్లో నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు కేసీఆరే. నాకు మంత్రి పదవి కన్నా పార్టీ పదవే విలువైంది. చేనేత వస్త్రాలకు నేను పెద్ద అభిమానిని.
* ఏపీలో మూడు రాజధానులపై ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్‌ పాలనకు శుభారంభమైంది.
* ప్రభుత్వ పనితీరుపై 60 లక్షల మంది తెరాస కార్యకర్తల నుంచి మాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తోంది.
* హైదరాబాద్‌లో సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రారంభమైంది. త్వరలోనే మార్పు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నగరానికి నీటి సమస్య తలెత్తదు.
* ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసింది. తెలంగాణపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.
* కొంపల్లి ఐటీపార్కుకోసం భూసేకరణ చేస్తు న్నాం. ఔషధనగరిని 2020లో ప్రారంభిస్తాం.
* చార్మినార్‌, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం. యూరప్‌, అమెరికా వంటి ప్రాంతాల నుంచి నగరానికి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాల కోసం కృషి చేస్తాం.
* హైదరాబాద్‌లో కొత్తగా 50 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్కైవాక్స్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపాం. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుంది.
* గోపనపల్లిలో పెరుగుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలకు ఆర్థిక జిల్లా నుంచి రోడ్లను నిర్మిస్తాం.

కొన్ని ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న:  సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వవచ్చు కదా?
కేటీఆర్‌: మీకు ధన్యవాదాలు. నాకు పూర్తికాలపు ఉద్యోగం (ఫుల్‌ టైం జాబ్‌) ఉన్నది.

ప్రశ్న: ఏపీలో మీ పార్టీని విస్తరించండి. ఇక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది?
కేటీఆర్‌: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది మా సీఎం కేసీఆర్‌ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.